వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
ప్రతిరోజూ, నేను రాబోయే 24 గంటల విషయాల గురించి మాత్రమే అడుగుతాను, ఎందుకంటే టెలివిజన్ పని, వ్యాపారం, నేను సంప్రదించగలిగే బృంద సభ్యులను (ముఖ్యంగా సంస్థలోని సభ్యులను) చూసుకోవడం వంటి ఇతర పనులతో నేను అంతకంటే ఎక్కువే నిర్వహించలేను. ఎందుకంటే వారికి కూడా మానవ శరీరాలే ఉన్నాయి – మృదువైన, సున్నితమైన మాంసం, మరియు కొన్నిసార్లు వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. బహుశఅకస్మాత్తుగా అనారోగ్యపాలవ్వడం వల్ల కావచ్చు, లేదా అకస్మాత్తుగా కింద పడటం వల్ల కావచ్చు, లేదా వారి కాలి వేలికి లేదా పాదానికి గాయం కలిగించే ఏదైనా సంఘటన వల్ల కావచ్చు. అప్పుడు నేను కూడా వాళ్లతో మాట్లాడి ఏం చేయాలో చెప్పాలి, ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వారు అలా చేయకూడదని నేను అనుకున్నాను, కానీ నొప్పిని లేదా అసౌకర్యాన్ని అలా పొడిగించుకుంటూ పోవడం సురక్షితం కాదు. మనం దీన్ని వెంటనే పరిష్కరించాలి. మరి దానిని ఎలనిర్వహించా లనేది కూడా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.వారు నాతో మాట్లాడటానికి మరి నా సలహా అడగడానికి ఇష్టపడతారు. అందుకే నేన వాళ్లతో మాట్లాడటానికి, వాళ్లను ఓదార్చడానికి, ఇంకా అలాంటి పనుల కోసం, కొన్నిసార్లు గంటల తరబడి సమయం గడపాల్సి వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటుంది. వాళ్లకు కూడా కాస్త మంచి అనుభూతి కలిగించడం కోసం, మేఅప్పుడప్పుడు అలా మాట్లాడుతుంటామ. అంతేకాకుండా, మరింత సన్నిహితంగా, మరింత స్వేచ్ఛగా, మరింత ప్రశాంతంగా సంభాషించడానికి ఇది ఒక అవకాశం. అందువల్ల ఇది వారి పని శక్తికి మరియు సహచరులుగా వారి సంబంధానికి కూడా మంచిది. ఒక్క క్షణం, నేను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వారు అది ఒక చిన్న విషయమని, దానంతట అదే నయమవుతుందని అను కోవచ్చు, కానీ అది ఎల్లప్పుడూ అలా ఉండదు. ఎందుకంటే నా విషయంలో, ఉదాహరణకు, నేను కొన్ని రోజుల క్రితం అనుకుంటా, లేదా వారం క్రితం, ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు, గట్టిగా కింద పడ్డాను. మరియు MAPA మరియు త్రిత్వం చాలా గంటలపాటు నన్ను స్వస్థపరచడానికి నిజంగా సహాయపడ్డాయి. మరియు నేను బాగానే ఉన్నాను. నాకు తలకు దెబ్బ తగలడం లాంటిదేమీ కాలేదనుకుంటా. నేను బాగానే ఉన్నప్పటికీ, తలనొప్పి ఇంకా తగ్గలేదు. నేను ఇంకా పని చేస్తున్నాను మరియు అంతా యధావిధిగా ఉంది. నాకు అప్పుడప్పుడు కొద్దిగా తలనొప్పి వస్తుంది. మరియు ఈ రోజు, నాకు తలనొప్పి లేని గత అనేక రోజుల కంటే ఎక్కువగా ఉంది. అది కింద పడిన సంఘటన వల్ల అయ్యిందనుకుంటాను. అది నిజంగా చాలా కష్టమైన ప్రయత్నం. గట్టిగా నెట్టడం అంటే కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నెట్టడం కాదు. అది ఒక పెద్ద ముఠా. ప్రతికూల కోణంలో, నన్ను వదిలించుకోవడానికి వాళ్ళు నిజంగా ఏదైనా చేస్తారు, కానీ నేను వాళ్లతో, “Unkraut stirbt nicht” అని చెప్పాను. అది జర్మన్ – వాళ్ళు అలానే అంటారు. దాని అర్థం “అడవి గడ్డి చనిపోదు.” అది ఆ విధంగా నిజం. మీరు మీ గడ్డిని కత్తిరిస్తారు లేదా కొన్నిసార్లు మొత్తం వేళ్లను పెకిలించివేస్తారు. కొన్ని రోజుల తర్వాత, ముఖ్యంగా కొద్దిగా వర్షం పడినప్పుడు, ఓహ్, అవి మళ్ళీ పచ్చగా, బలంగా, శక్తివంతంగా మొలకెత్తుతాయి. కాబట్టి, నేను వారితో, “నేను ఒక అడవి గడ్డిని అని చెప్పాను. నేను ఒక 'పనికిరాని' వాడిని. కాబట్టి ఏదీ నన్ను చంపలేదు. నేను జీవిస్తూనే ఉంటాను.” కానీ వారు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. వాళ్ళు నన్ను బాధపెట్టాలని ప్రయత్నిస్తారు… దూరం నుంచి కూడా. వావ్, ఈ ప్రతికూల శక్తి ఎంత శక్తివంతమైనదో. అందుకే వారు మానవులను, మొత్తం మానవ జాతిని, జంతు-ప్రజలను, ఇతర విషయాలను కూడా, మంత్రగత్తెలందరినీ మరియు అలాంటి వాటన్నింటినీ నియంత్రించగలిగారు. అందుకే వారు ఇప్పటి వరకు ఎన్నో, ఎన్నో, ఎన్నో వేల సంవత్సరాలుగా భూమిని నియంత్రించగలిగారు. అంతకు ముందు, మా పరిస్థితి బాగుండేది. మేము బాగానే ఉన్నాము. వారు ఈ ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుని తమ సొంతం చేసుకోవాలనుకునే వరకు, కానీ ఇప్పుడు వారు మన ప్రజలను రకరకాలుగా చంపుతున్నారు. మరియు వారు నన్ను ఎల్లప్పుడూ నేరుగా తాకలేకపోయినప్పటికీ, నన్ను వేధించడానికి నా శిష్యులను లేదా నా కుక్క మనుషులను కూడా వాడుకుంటారు, ఎందుకంటే నా సొంత కుక్క మనిషి అనారోగ్యంతో నిస్సహాయంగా ఉండటాన్ని చూడటం లేదా తెలుసుకోవడం, లేదా నా సొంత శిష్యులు అని పిలవబడే వారు ఈ శక్తులచే వేధించబడటాన్ని చూడటం కంటే, ఆ బాధను నేనే అనుభవించడం మేలు. వారు దుర్మార్గులు; వారు క్రూరులు. మరియు నా శిష్యులు అని పిలవబడే వారందరూ లేదా నా జట్టు సభ్యులు కూడా ప్రతికూల శక్తికి అందని ఉన్నత స్థాయిలో లేరు. అంతేకాకుండా, వారి కర్మ, వారి ప్రస్తుత జీవిత కర్మ కూడా కొన్నిసార్లు వచ్చి వారిని ఇబ్బంది పెడుతుంది, అప్పుడు నేను కూడా జోక్యం చేసుకోవలసి వస్తుంది. నేకొంత కర్మఫలాన్ని స్వీకరించగలను, కానీ మొత్తం కాదు. అలా చేయడానికి అనుమతి లేదు. ఈ భౌతిక ప్రపంచంలో అది అలా పనిచేయదు. కాబట్టి నేను కొంత కర్మను పొందుతాను, మరియు చాలా చిన్న చిన్న విషయాలు, అక్కడక్కడా చాలా ఎక్కువ చిన్న కర్మలు ఉంటే, అది శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నేను ఇనుముతో చేయబడలేదు. నేను కూడా నీలాగే మాంసం, ఎముకల మనిషిని. సరే, నా ప్రియమైన దేవుని అందమైన శిష్యులారా, దేవుని శిష్యులు, ఆ నక్క-మనిషి రావడానికి కారణం, బహుశా కొన్ని రోజుల క్రితం లేదా కొన్ని వారాల క్రితం జరిగిన ఆ సమావేశమే అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక సమావేశానికి వెళ్లాల్సి ఉందని ఫ్లై-ఇన్ న్యూస్లో ఒకదానిలో ప్రస్తావించాను. బుద్ధ రాజుతో సమావేశం తర్వాత, వెంటనే నేను MAPA మరియు కొంతమంది బుద్ధ రాజులతో ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. ఇది ప్రపంచం గురించో లేక మరేదాని గురించో కాదు. ఇది కేవలం నా కోసమే. ఈసారి అంతా నా గురించే. నేను ఆశ్చర్యపోయాను. సమావేశం ఎలాంటిదో, అందులో ఎలాంటి అంశాలు ఉంటాయో నాకు ముందుగా చెప్పలేదు. నాకు ఆ విషయం ఆ సమయంలో మరియు ఆ తర్వాత మాత్రమే తెలిసింది. అందుకే, వారు నా భద్రత గురించి మాట్లాడారు మరియు నన్ను నేను సురక్షితంగా ఉంచుకోవడానికి ఎలక్ట్రానిక్ మార్గాన్ని ఉపయోగించాలని చెప్పారు. బుద్ధ రాజు, “భద్రతే ప్రథమం” అని అన్నారు. నా దగ్గర ఇప్పుడు నోట్స్ లేవు, కాబట్టి వాటిని మీ కోసం తర్వాత చదువుతాను. నాకు ఇంకా సంకోచమే, కానీ బహుశా అందులో 90% మీకు చదివి వినిపిస్తాను, మీకోసం, కేవలం మీకు కొంత అవగాహన కల్పించడం కోసం. లేకపోతే, మీకు అంతర్గత అనుభవాలు ఉన్నాయి, కానీ నాకు ఉన్నవి మీకు లేవు. అందుకే చాలాసార్లు మీరు నన్ను నా డైరీ లాంటివి అడుగుతుంటారు, లేదా నేనేం చేశానో అడుగుతుంటారు, కానీ నేను ఎప్పుడూ మీకు అన్నీ చెప్పను. నేను చేయలేదు. కాబట్టి ఈ మధ్య నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను, కనీసం నాకు తెలిసినంత వరకు, దానివల్ల మీరు కూడా ఏదైనా నేర్చుకుంటారు. నా జీవితంలో ఫలానావి జరుగుతున్నాయని, నేను చేయాల్సినవి లేదా చేయగలిగినవి ఉన్నాయని, లేదా నేను ఒక చిన్న శాంతి పోరాటంలో గెలిచానని, కొన్ని దేశాలు యుద్ధరహితమయ్యాయని, అలాంటి విషయాలు మీకు కూడా తెలుసు. కానీ నేను మీకు అన్ని వివరాలు చెప్పలేను, ఎందుకంటే ఆ పోరాటం పోరాటమే, భౌతికమైనా, ఆస్ట్రల్ అయినా, అవి రెండూ ఒకటే. మీరే దాన్ని ఊహించుకోవచ్చు. లేకపోతే, ఎవరు ఎవరిని చంపుతున్నారనే దాని గురించి మాట్లాడుతూ నేను చాలా సమయం వృధా చేస్తాను. చంపకూడదనే సూత్రం మాకు ఉంది. కానీ మానవులను మరియు ఈ గ్రహాన్ని రక్షించడానికి, దానిని సజీవంగా ఉంచడానికి, కొంతమంది దుష్టశక్తులను నిర్మూలించాలి. ఎందుకంటే వారు ప్రతికూల శక్తి కోసం పనిచేస్తూ, మానవులను చంపుతున్నారు లేదా వారిని అంగవైకల్యానికి గురిచేస్తున్నారు, లేదా వారికి మత్తుమందులు ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను, లేదా వారిని అనేక రకాలుగా నియంత్రిస్తున్నారు, దానివల్ల వారు దేవుడిని కూడా గుర్తుంచుకోలేకపోతున్నారు. వారు అప్పుడప్పుడు కూడా ప్రార్థన చేయరు. వారికి ప్రార్థన చేయడం కూడా తెలియదు, లేదా వారు చర్చికి గానీ, గుడికి గానీ, మసీదుకు గానీ, లేదా వారిని రకరకాల పేర్లతో పిలిచే ఏ ఇతర మత సంస్థలకు గానీ ఎప్పుడూ వెళ్లరు. యూదుల ప్రార్థనా మందిరాల వలె. మీకు తెలుసా, ప్రతి మతంలోనూ చర్చిలు కడతారు, కానీ వారి భాష వేరుగా ఉండటం వల్ల వాటికి వేర్వేరు పేర్లు పెడతారు. అంతే. క్రైస్తవంలో లాగానే, వారు తమ సామూహిక ప్రార్థనా మందిరాన్ని ఒక చర్చి అని పిలుస్తారు. మరియు బౌద్ధులు, వారు ఆ నిర్మాణాన్ని దేవాలయం అని పిలుస్తారు. మరియు ముస్లింలు, దేవుడిని ఆరాధించడానికి వారు సమావేశమయ్యే తమ పవిత్ర స్థలాన్ని మసీదు అని పిలుస్తారు. ఉదాహరణకు, ఆ విధంగా. మరియు మాకు మా స్వంత దేవాలయం ఉంది. ఇది పరిశుద్ధాత్మ నివసించే పవిత్రమైన శరీరం. కాబట్టి బైబిల్లో ఇలా చెప్పబడింది, “మీరు దేవుని ఆలయమని, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా?” లేదా, “దేవుని రాజ్యం మీలోనే ఉంది.” కాబట్టి ఇప్పుడు, మనం కూడా ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అది ఇంకా శుద్ధి చేయబడకపోతే దాన్ని శుద్ధి చేయాలి: మీలోని మీ స్వంత దైవ రాజ్యాన్ని తిరిగి పొందడానికి, వెంటనే వేగన్తో ప్రారంభించాలి. నీ మీద, నీ చుట్టూ, నీ లోపల, నీ బయట పేరుకుపోయిన చెత్తనంతటినీ శుభ్రం చేయి. మిమ్మల్ని మీరు తిరిగి స్వచ్ఛమైన, సరైన, సమర్థవంతమైన మరియు పవిత్రమైన దేవుని ఆలయంగా చేసుకోండి. నేను మాట్లాడేటప్పుడు, మర్చిపోతాను, ఎందుకంటే నా దగ్గర స్క్రిప్ట్ ఉండదు. నాకు ఎప్పుడూ స్క్రిప్ట్ ఉండదు. ముఖ్యంగా దేవుడితో లేదా బుద్ధ రాజుతో మాట్లాడటం. వారు నాతో ఏమి చెప్పబోతున్నారో నాకు ఎప్పటికీ తెలియదు, అలాంటప్పుడు నేను దాన్ని ఎలా రాయగలను? నాకు అసలు ఏ స్క్రిప్ట్ అవసరమే రాలేదు. నేను ఈ ఉద్యోగం చేపట్టినప్పటి నుండి, దైవ కృప వల్ల, దైవ సంకల్పం వల్ల, మాట్లాడటానికి ఏ స్క్రిప్ట్ కూడా ఎప్పుడూ రాయలేదు. నేను ఎక్కువగా అక్కడే కూర్చుంటాను. నా ముందు ఏమీ లేదు, నేను దేనినీ పరిశీలించను. నేను మాట్లాడేది నేరుగా దేవుడి నుండి వస్తుంది కాబట్టే. మాట్లాడటంలో గానీ మరేదైనా విషయంలో గానీ ఏదైనా తప్పు ఉంటే, అది నా మానవ ప్రమాణాల తప్పిదం; దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు. మనం మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటాము. మనం ఏదైనా చదివినప్పుడు లేదా విన్నప్పుడు కూడా, దాన్ని తప్పుగా విని, తప్పుగానే పునరావృతం చేస్తాము. అందుకే ఈ ప్రపంచంలో ఎన్నో ఇబ్బందికరమైన విషయాలు జరుగుతాయి. కానీ నేను అలాంటి ఘోరమైన తప్పు చేయను. బహుశా, నేను పుట్టుకతో ఆంగ్లేయుడిని కాకపోవచ్చు, అందుకే నేను ఎప్పుడూ ఉపయోగించని కొన్ని పదాలు వాటంతట అవే నోటి నుండి వస్తాయి, బహుశా నేను వాటిని తప్పుగా ఉచ్ఛరించి ఉండవచ్చు. కానీ అది ఒక చిన్న పొరపాటు మాత్రమే. కొంతమంది, ఆకాశంలోని సూర్యుడిని “సూర్యుడు” అని అనడానికి బదులుగా, “కుమారుడు” అని అంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఎవరినైనా ఆటపట్టించాలనే ఉద్దేశంతో సరదాగా జోకులు వేస్తుంటారు. వారు, “నువ్వు నా కొడుకువి” అని అంటారు. ఆ పదాలు ఒకేలా ఉంటాయి కాబట్టి, దానికి నా సూర్యుడు అని అర్థం. మరియు నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఉపయోగించని కొన్ని పదాలు, అందుకే మర్చిపోయి ఉండవచ్చు. అంతే – పెద్ద పొరపాటేమీ కాదు. ఇప్పుడు, గతంలో భగవంతునితో మరియు దేవుడు తో కొంతమంది బుద్ధ రాజులతో జరిగిన సంభాషణ, సమావేశం, సదస్సు కారణంగా… నేఇంతకు ముందు కొనసాగించడం మర్చి పోయాను,కాబట్టి ఇప్పుడు కొనసాగిస్తున్నాను. అడవిలో నా భద్రత గురించి ప్రస్తావన వచ్చింది, అందుకే అప్పటి నుండి నేను కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నాను. నిజానికి, నేను సాధారణంగా అటూ ఇటూ నడవడానికీ, వాకింగ్ కోసమో లేదా మరేదైనా పని కోసమో కూడా పది మీటర్ల కంటే ఎక్కువ దూరం బయటకు వెళ్ళను. కాబట్టి నే నిజానికి చాలా వరకు సురక్షితంగానే ఉన్నాను. పెద్ద జింకల మనుషులు మరియు మరికొంతమంది ఇంకా పెద్ద మనుషుల వంటి పెద్ద జంతు-ప్రజలు ఉన్నారు, కానీ ఆ జంతు-ప్రజలు నాతో చాలా సౌమ్యంగా ఉంటారు. వాళ్ళు నా వైపు చూస్తారేమో, లేదా రెండు మూడు సార్లు తల వంచి నమస్కరించి, ఆ తర్వాత వెళ్ళిపోతారు. సమస్య లేదు. కానీ ఆ సదస్సు జరిగినప్పటి నుండి, నా పరిసరాల పట్ల నేను కొంచెం ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకే నేను మరింత శ్రద్ధ పెడతాను. Photo Caption: “ప్రకృతిని అనుకరించడం కష్టం”











