శోధన
తెలుగు లిపి
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
శీర్షిక
ట్రాన్స్క్రిప్ట్
తదుపరి
 

శివుని 112 ఏకాగ్రతా మార్గాలు I, 7 యొక్క 5 వ భాగం

వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
ఇప్పుడు, ఎనిమిదవది. ఒకవేళ మీకు స్వేచ్ఛా సమయం దొరికి, (అంతర్గత దివ్య) కాంతి ధ్యానం చేయడానికి ఆ సమయం చాలా తక్కువగా ఉంటే, అప్పుడు మీరు "కనుబొమ్మల మధ్య ఏకాగ్రత పెట్టవచ్చు." మీకు తెలిసినట్లుగా, అది ఎక్కడ ఉందో మీకు తెలుసు, బహుశా ఆ జ్ఞాన కేంద్రం కావచ్చు, మరియు ప్రతి ఆలోచన తలెత్తడానికి ముందు మీ మనస్సును ఆ ప్రదేశంపై కేంద్రీకరించండి. అది ఎక్కడ ఉందో మీకు తెలుసు. ఆలోచనలన్నీ మొదలవక ముందే, కోరికలన్నీ చిగురించక ముందే, దానిపై ఏకాగ్రత పెట్టండి. బహుశా, బౌద్ధ పరిభాషలో మనం దానిని “శూన్యత,” “ఖాళీ ప్రదేశం,” లేదా “మనస్సు లేని ప్రదేశం,” లేదా “ద్వారం లేని ద్వారం” వంటి పేర్లతో పిలుస్తాము. ఆపై ఆ సమయంలో మీ మనస్సులోకి ఏ రూపం రావాలో, లేదా బహుశా మీ స్వంత రూపమైనా సరే, అది విశ్వ ప్రాణశక్తితో నిండి ఉండనివ్వండి. బహుశా ఊహించుకోండి. “ఆపై, మీరు ఈ (అంతర్గత దివ్య) కాంతిలో, ఈ విశ్వసారంలో ‘స్నానం’ చేస్తారు.” మీరు స్నానం చేస్తున్నట్లుగా ఉంటుంది, కానీ అది నీటి స్నానం కాదు, విశ్వ (అంతర్గత దివ్య) కాంతి, విశ్వ ఆశీర్వాదం మరియు జ్ఞానోదయం యొక్క స్నానం.

కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ, ఆ క్షణంలో మనం పడుతున్న శ్రమను, ఆ పరిస్థితిని ఉపయోగించుకుని, వర్తమానంలో ఉంటూ, మనల్ని మనం ప్రకాశవంతం చేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించవచ్చు. అది అత్యుత్తమ పరిస్థితి. కాబట్టి అన్ని రోజువారీ కార్యకలాపాలలో మనం ఎల్లప్పుడూ సాధన చేయవచ్చు. “నాకు సమయం లేదు…” అని చెప్పాల్సిన అవసరం లేదు. "నేను నా కాళ్ళు ముడుచుకోలేను," మరియు అలాంటి విషయాలు. మీకు వీలైనప్పుడల్లా, మీరు దాన్ని చేయాలి. మరియు ఎప్పుడైతే మీరు అలా చేయలేరో, అప్పుడు మీరు పని చేస్తున్నప్పుడే దాన్ని చేస్తారు. మీ పనిని ధ్యానంగా మార్చుకోండి. అన్ని పనుల వెనుక, అన్ని పరుగుల వెనుక, అన్ని కార్యకలాపాల వెనుక ఉన్న శక్తిపై దృష్టి కేంద్రీకరించండి, అప్పుడు మీకు ధ్యానించడానికి ఎల్లప్పుడూ ఏదో ఒకటి దొరుకుతుంది. మరియు ఎల్లప్పుడూ పుష్కలంగా సమయం ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి పరిస్థితిలోని సమయాన్ని ఏకాగ్రత కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైందా? (అవును.)

ఇప్పుడు, తొమ్మిదవది. “మీరు మీ పంచేంద్రియాలను నెమలి తోకలోని ఐదు రంగులుగా పోల్చి వాటిని అంతరిక్షమంతా పరచవచ్చు,” మీరు ఐదు రంగుల ఎర్ర నెమలి తోకలను విశ్వమంతటా వ్యాపింపజేశారు. వాటిని రంగులతో నింపండి. విశ్వాన్ని రంగులతో నింపండి. కానీ, ఈ రంగులు మీ పంచేంద్రియాలు అని భావించాలి. బహుశా, వాసన చూడటం, రుచి చూడటం, స్పర్శించడం వంటి ఇంద్రియాలు.... ఇప్పుడు, నెమలి తోక రంగు చాలా రంగురంగులగా మరియు చాలా అందంగా ఉంటుంది కాబట్టి, మీరు ఆ రంగులను మరియు అందాన్ని మీలో లీనం చేసుకోండి. ఆ తర్వాత, ఎప్పుడైతే మీకు ఒక పరిమితి ఉందని అనిపిస్తుందో, ఇక ఏమాత్రం పరిమితి మిగలనంత వరకు వాటిని విస్తరింపజేయండి. “అలాంటప్పుడు, మీరు మీ మనస్సులోని అన్ని సరిహద్దులను కరిగించుకుంటారు, అప్పుడు మీరు ఇతరులకు ఏది మంచి జరగాలని కోరుకుంటారో అది నిజమవుతుంది.” కాబట్టి, ఈ విధంగా మీరు మీ శక్తిని అపరి మితమైన ఉపయోగంగా మార్చుకుంటారు. ఆ విధంగా మీరు అసంఖ్యాకమైన ప్రాణులకు మేలు చేయగలరు, మరియు మీ… చుట్టూ ఉన్న, లేదా మిమ్మల్ని కలిసే, లేదా మీరు ప్రార్థించే అన్ని రకాల ప్రజలకు ఒకరకమైన ఉపకారిగా ఉండగలరు. సరే. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? ఇప్పటికే తొమ్మిదో సంఖ్య, కదా? నేను సహజంగా మాట్లాడినప్పుడు, అది సులభంగా ఉంటుంది. కానీ నేను ప్రాచీన జ్ఞానం యొక్క అర్థంపై దృష్టి సారించాల్సి వచ్చినప్పుడు, మరియు నేను ఒక పొరపాటు చేయకూడదనుకున్నప్పుడు, అది మరింత మేధోపరమైనది, మరియు చాలా కష్టం. మేధోపరమైన; మేధోపరమైన సంభాషణను ఉపయోగించడం చాలా కష్టం.

సరే, పదవది: “మీరు మీ కళ్ళు మూసుకుని, మీ అంతరాత్మను అన్ని వివరాలతో చూడటానికి ప్రయత్నించవచ్చు.” అలా మీరు అంతరాత్మపై ఏకాగ్రత పెడుతున్నప్పుడు, “అప్పుడు మీరు మీ నిజ స్వరూపాన్ని చూస్తారు.” మీకు వీలైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఏ పద్ధతిని ఉపయోగించలేకపోతే, దానిని వదిలేయండి.

మరియు పదకొండవది: “మీ పూర్తి శ్రద్ధను మీ నరాలపై ఉంచండి, మరియు నరాలు తామర పువ్వులోని దారం వలె చాలా సున్నితమైనవని మీరు తెలుసుకోవాలి. ఆ విధంగా, మీరు మీ భౌతిక స్వరూపాన్ని మార్చుకుంటారు.” ఆయన ఉద్దేశం ఏమిటంటే, మనసును అదుపులో ఉంచుకోవడం అంత కష్టమైతే, మన శరీరంలోని నరాల వంటి ఒక సున్నితమైన నమూనాపై దాని ఏకాగ్రతను పెంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు వాటిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు, కాబట్టి ఈ నరాలన్నింటినీ ఊహించుకోవడం మనసుకు చాలా కష్టం, మరియు అది అతనికి మంచిది; అది అతనికి బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అతనికి అటూ ఇటూ తిరగడానికీ, మరే ఇతర పనులు చేయడానికీ సమయం ఉండదు. ఒకవేళ, బహుశా... చాలా మందికి, అలా సంక్లిష్టంగా ఉండటమే వారికి సరిపోతుంది. ఎందుకంటే జీవులన్నీ ఒకేలా ఉండవు; ప్రజలందరూ ఒకేలా ఉండరు. కాబట్టి అందరూ ఏకాగ్రత పెట్టడానికి ప్రయత్నిస్తే, అతను బహుశా వేరే రకమైన ఏకాగ్రతను, వేరే పరిస్థితిని ఉపయోగిస్తాడు.

హిమాలయాల్లో, బహుశా మీకు ఈ సంక్లిష్టతలన్నీ అవసరం ఉండకపోవచ్చు. నువ్వు మంచు వైపు మాత్రమే చూస్తావు, ఆ తర్వాత గడ్డకట్టుకుపోతావు. మీరు కాలంలోనూ, ప్రదేశంలో స్తంభించి పోతారు. మరియు మనస్సు మరెక్కడికీ పారిపోలేదు, ఎందుకంటే కొంతసేపటికి అది శూన్యతకు, తెల్లదనానికి, మరియు పర్వతం యొక్క శూన్యతకు అలవాటు పడిపోతుంది. అతను ఊహించుకోవడానికి అక్కడ ఏమీ లేదు. కొంతకాలం తర్వాత, బహుశా, మనసులో నిక్షిప్తమైన కోరికలన్నీ, అలవాటైన పద్ధతులన్నీ క్షీణించి, ఖాళీ అయిపోతాయి. ఆ తర్వాత అతను దాన్ని వార్తాపత్రికలతోనో, టెలివిజన్‌తోనో, లేదా చెత్త సినిమాలతోనో తిరిగి నింపడు. అప్పుడు అది కనీసం సగం ఖాళీగా ఉంటుంది. అందుకే చాలా మంది గురువులు హిమాలయాలను లేదా ఎడారిని ఇష్టపడతారు.

నేను కూడా ఎడారిలో ఉండిపోయాను. అది చాలా అందంగా ఉంది, కొన్నిసార్లు, బహుశా రెండు వారాల పాటు. ఒక రోజు వరకు, చాలా చలిగా ఉండటంతో నేను దాదాపు కుప్పకూలిపోయాను. ఆ తర్వాత నేను ఇంటికి, నగరంలోకి, నగరంలోకి కాదు, మరో చోటికి తిరిగి పరుగెత్తాల్సి వచ్చింది. అది ఒక ఇల్లు. ఎందుకంటే నేను బస చేసిన ఎడారిలో ఇల్లు లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. నీళ్ళు ఉన్నాయి, కానీ మనం వెళ్లి వాటిని తెచ్చుకోవాలి. చాలా దూరంగా, సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో. అది అలా నేరుగా కుళాయి నుండి వచ్చేది కాదు. మరియు ఆ ఎడారిలో ఏమీ లేదు, అక్కడక్కడా ఎండిన పొదలు, మరియు ఎలుక(-మానవులు) తప్ప. అవును, మా దగ్గర కుందేలు మనుషులు ఉండేవారు. ఎడారి కుందేలు(-మనిషి) ఎంత చిన్నగా ఉంటుందంటే మీరు ఊహించలేరు. మీరు దాన్ని ఎలుక(-మనిషి) అనుకుని ఉంటారు! అవును, చాలా చిన్నది, కానీ కుందేలు(-మనిషి) లాగాకనిపిస్తుంది. నా లాగే, నే చూడటానికి చిన్నగా కనిపిస్తాను కానీ నేను... నేను ఒక మానవుడిని. బహుశా ఎడారిలో తినడానికి ఏమీ ఉండదు, అందుకే కుందేలు(-మానవులు) చిన్నగా, ఇంకా చిన్నగా, మరింత చిన్నగా అవుతూ ఉంటారు.

అయితే, ఇప్పుడు ఇంకేముందో చూద్దాం. పన్నెండవది: “మీ చేతులతో తలలోని ఏడు రంధ్రాలను మూసివేసినప్పుడు, మీ కనుల మధ్య ఉన్న ప్రదేశం సర్వవ్యాపకం అవుతుంది.” దాని అర్థం ఏమిటో మీకు ఇప్పటికే తెలుసు కదా? ఇదంతా జ్ఞాన కేంద్రం వద్ద ముగుస్తుంది. దాని గురించి మాట్లాడే మరో విధానం. అలాగే, నేను ఎన్నో విషయాలు మాట్లాడతాను, కానీ చివరికి అదంతా ఎప్పుడూ క్వాన్ యిన్ పద్ధతి దగ్గరికే వస్తుంది. నేను రకరకాల ఉపన్యాసాలు ఇస్తాను, రకరకాల నోరూరించే “వంటకాలు” తయారు చేస్తాను, కానీ చివరికి వాళ్ళకి ఇచ్చేది ఒక్కటే – క్వాన్ యిన్ పద్ధతి మరియు (అంతర్గత దివ్య) కాంతి.

ఇప్పుడు, పదమూడవది. బహుశా సరిగ్గా ఏకాగ్రత పెట్టలేని వారి కోసం ఇవి, కాబట్టి వివిధ రకాల సహాయక సాధనాలను ఉపయోగిస్తారు. అలాగే కొన్నిసార్లు ప్రజలు నాకు రాసి, (అంతర్గత దివ్య కాంతిపై ఏకాగ్రత పెట్టడం తమకు చాలా కష్టంగా ఉందని చెబుతుంటారు. అందుకే నేను అంటాను, “సరే, నీ జ్ఞాన నేత్రాన్ని కొద్దిగా గీరుకో, లేదా గోరుతో తాకు, లేదా నువ్వు భరించగలిగితే సూదితో తాకు. కానీ నీకు నువ్వే గాయం చేసుకోకు. ఇక్కడ నుండి రక్తం కారనీయకు, గుర్తుండేలా దాన్ని తాకు.” అది ఆ పద్ధతులలో ఒకటి. లేదా కొన్నిసార్లు, ఎవరైనా... శివుడు ఇక్కడ ఆ విషయం చెప్పలేదు, కానీ నా దగ్గర దీనికంటే ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు, నేను ధ్యాన మందిరంలో తిరుగుతున్నప్పుడు, కొంతమంది అక్కడ గాఢమైన “సమాధి”లో కూర్చొని ఉండటం చూస్తాను, అతను ఎప్పుడూ తల అటూ ఇటూ తిప్పుతూ ఉంటాడు, అప్పుడు నేను అతని శిరస్సు చక్రం మీద మెల్లగా తడతాను, ఆ తర్వాత అతను మళ్ళీ ఏకాగ్రత పెడతాడు. కానీ ఆ పద్ధతిని శివుడు ఇక్కడ రాయలేదు. నేఆయనకు చెబుతాను, నేను ఆయనకు చెబుతాను, ఆయన ఇంతకంటే ఎక్కువగా ఆధునికంగా మారాలి. ఎందుకంటే పాత కాలంలో, బహుశా ప్రజలు ఈ రోజుల్లో లాగా అంతగా నిద్రపోయేవారు కాదు. మరియు ఈ రోజుల్లో, ప్రజల వద్ద ఎయిర్ కండిషనింగ్ మరియు హీటింగ్ వ్యవస్థలు ఉన్నాయి, కాబట్టి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే ప్రజలు అతి సుఖంగా ఉండటానికి మొగ్గు చూపుతారు, అందువల్ల మనం మరిన్ని పద్ధతులను ఉపయోగించాల్సి ఉంటుంది.

కాబట్టి, పదమూడవది, ఆయన ఇలా అంటారు, “ధ్యానం చేస్తున్నప్పుడు బహుశా మీరు ఏకాగ్రత చూపలేకపోతే,” అప్పుడు మీరు మీ కనుగుడ్లను ఈకంత తేలికగా తాకవచ్చు. ఆపై బహుశా ఆ సమయంలో మీరు (అంతర్గత దివ్య) కాంతిని చూస్తారు.” అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడూ నిద్రపోతావు కాబట్టి, నీ కళ్ళను ఇంకా ఎక్కువగా రుద్దుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరు ఈకలా తాకితే, కనీసం కదలలేరని నేను అనుకుంటున్నాను. మీరు మీ చేతి తొడుగులతో సహా రుద్దుతారు. ఆయన చెప్పింది పాతకాలపు ప్రజల కోసం. అయినప్పటికీ, మీరు ఏకాగ్రత పెట్టలేకపోతే ప్రయత్నించవచ్చు. మీ వేళ్లతో మీ కనుగుడ్లను "ఈకంత తేలికగా" తాకడానికి మీరు చేసే ప్రయత్నమే ఏకాగ్రత అయి ఉండాలి. ఇది మీ మనసును తిరిగి ఏకాగ్రతలోకి తీసుకురావడానికి ఒక ఉపాయం మాత్రమే. అంటే ఇది చాలా బాగుంది, కదూ? (అవును.)

కాబట్టి మీరు అప్పటికే అన్ని రకాలుగా తలకిందులై, జర్మనీ నుండి అమెరికాకు, ఆపై తిరిగి బాత్రూమ్‌కు, మళ్ళీ భోజనాల గదికి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మీలాంటి గరుకైన చేతిని "ఈకలా తేలికగా" పెట్టడానికి కూడా మీరు తగినంత ఏకాగ్రత చూపగలిగితే... అక్కడ ఈకలా తేలికగా మీరు మళ్ళీ ధ్యానం చేసే పనిలోకి తిరిగి వస్తారు. కాబట్టి, మాస్టర్ చాలా తెలివైనవాడని నేను అనుకుంటున్నాను; శివుడు చాలా తెలివైనవాడు. ఆయన అన్ని రకాల పద్ధతులను ఉపయోగించి, మనలోని అన్ని రకాల చెడు అలవాట్లను, ప్రతికూలతను నాశనం చేశారు.

Photo Caption: “మీ భద్రత కోసం కాపలా కాయండి”

ఫోటో డౌన్లోడ్ చేయండి   

మరిన్ని చూడండి
అన్ని భాగాలు (5/7)
1
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-05-12
7579 అభిప్రాయాలు
2
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-05-13
7057 అభిప్రాయాలు
3
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-05-14
6713 అభిప్రాయాలు
4
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-05-15
6619 అభిప్రాయాలు
5
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-05-16
6033 అభిప్రాయాలు
6
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-05-17
6141 అభిప్రాయాలు
7
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-05-18
5810 అభిప్రాయాలు
మరిన్ని చూడండి
తాజా వీడియోలు
గమనార్హమైన వార్తలు
2026-11-01
1587 అభిప్రాయాలు
34:38

గమనార్హమైన వార్తలు

1263 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-11-01
1263 అభిప్రాయాలు
మా ప్లానెట్ గురించి ప్రాచీన అంచనాలపై పలు భాగాల సిరీస్
2026-11-01
2215 అభిప్రాయాలు
4:24
లఘు చిత్రాలు
2026-11-01
2778 అభిప్రాయాలు
5:10
లఘు చిత్రాలు
2026-11-01
2481 అభిప్రాయాలు
4:40
లఘు చిత్రాలు
2026-11-01
1971 అభిప్రాయాలు
3:49
లఘు చిత్రాలు
2026-11-01
1855 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-10-31
3111 అభిప్రాయాలు
షేర్
భాగస్వామ్యం చేయండి
పొందుపరిచిన
దీని వద్ద ప్రారంభించు
డౌన్లోడ్
మొబైల్
మొబైల్
ఐఫోన్
ఆండ్రోయిడ్
మొబైల్ బ్రౌజర్లో చూడండి
GO
GO
అప్ప్
QR కోడ్ను స్కాన్ చేయండి లేదా డౌన్లోడ్ చేయడానికి సరైన ఫోన్ సిస్టమ్ను ఎంచుకోండి
ఐఫోన్
ఆండ్రోయిడ్
Prompt
OK
డౌన్లోడ్